గ‌రుడ వేగ టీజ‌ర్ విడుద‌ల‌

Fri,September 22, 2017 05:17 PM
PSV GARUDA VEGA teaser released

రాజశేఖర్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్‌ని తాజాగా రానా, తాప్సీ, కాజ‌ల్‌, మంచు ల‌క్ష్మీ తమ‌ అఫీషియల్ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్ ద్వారా విడుదల చేసారు . టీజ‌ర్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండ‌గా, మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది. జార్జియా, థాయ్ లాండ్ వంటి అందమైన ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది . ఇందులో పూజా కుమార్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జార్ణ్ అనే కరుడు గట్టిన విలన్ పాత్రలో కిషోర సహా నటిస్తున్నాడు. నాజర్, పోసాని , అలీ, పృధ్వీ, షియాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, చరణ్ దీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles