ప్రియాంక చోప్రా డ్రెస్‌కి నిక్ జోనాస్ రివ్యూ

Wed,March 20, 2019 01:45 PM
Priyanka Chopras Sheer Dress Gets A 3 Heart Review

గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా గ‌త ఏడాది అమెరికన్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు లైఫ్‌ని స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తూ నెటిజన్స్ దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. జోనాస్ బ్ర‌ద‌ర్స్( జో, కెవిన్‌, నిక్‌) వారి వైఫ్స్( సోఫీ, డానియెల్‌, ప్రియాంక‌) కాంబినేష‌న్‌లో ఇటీవ‌ల‌ రూపొందిన ఆల్బ‌మ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అపూర్వ ఆద‌ర‌ణ ఈ వీడియోకి రావ‌డంతో నిక్ జోనాస్ తన స‌తీమ‌ణి ప్రియాంక చోప్రాకి రూ.2.7 కోట్లతో మేబాచ్ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును కొని దాన్ని బహుమతిగా ఇచ్చారు. త‌న భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్‌ని చూసి తెగ మురిసిపోయింది ప్రియాంక‌. అంతేకాదు ఆ గిఫ్ట్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. త‌న భ‌ర్త ఉత్త‌మ భ‌ర్త అని చెబుతూ ఐల‌వ్ యూ బేబీ అనే కామెంట్ పెట్టింది.ఇక తాజాగా ప్రియాంక చోప్రా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో త‌ళుక్కున మెరిసింది. ఈ ఫోటోల‌లో ప్రియాంక‌ని చూసిన అభిమానుల‌కి నోట మాట రాలేదు. ఇక ఆమె భ‌ర్త నిక్ జోనాస్ అయితే మూడు హార్ట్ ఎమ్మోజీస్‌తో ఆశ్చ‌ర్య‌పోయే రివ్యూ ఇచ్చాడు. ప్ర‌స్తుతం నిక్ ట్వీట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రియాంక న‌టించిన ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ అనే హాలీవుడ్ చిత్రం ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది . ఇక ఆమె న‌టిస్తున్న‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే బాలీవుడ్ చిత్రం అక్టోబ‌ర్ 11,2019న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

View this post on Instagram

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

View this post on Instagram

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

View this post on Instagram

🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


6749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles