వాహనంలో నుండి జారి పడిన ప్రియాంక.. సాయం చేయని కోస్టార్ !

Sat,November 18, 2017 09:20 AM
priyanka chopra stunning stunt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అయింది. ఒకవైపు హాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరో వైపు అమెరికన్ టీవి సిరీస్ క్వాంటికో3 లో నటిస్తుంది. అయితే క్వాంటికో 3 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు సరదాగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన కోస్టార్ రొషెల్ టావేతో ప్రియాంక ఓ వాహనంలో ప్రయాణిస్తూ, కొన్ని ఫీట్స్ చేస్తుంటుంది. అనుకోకుండా జారి వాహనం నుండి పడిపోతుంది. కాని ఆ టైంలో తన కో స్టార్ ఏం పట్టనట్టు బిందాస్ గా కూర్చుంటాడు. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డు అయింది. ఇది చూసిన వారు ప్రియాంకకి ఏమైన జరిగిందా అని ఆందోళనలో పడుతున్నారు. కాని అసలు విషయమేమంటే ఇదంతా కెమెరా ట్రిక్. వాహనం ఎక్కడికి కదలదు. కాని బ్యాక్ గ్రౌండ్ లో కెమెరా స్పీడ్ గా మూవ్ అవుతుండడంతో మనకి వాహనం స్పీడ్ గా వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను ప్రియాంక చోప్రా టీం సభ్యులు ట్విట్టర్ లో షేర్ చేశారు.2101
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS