మోదీ బ‌యోపిక్‌లో ప్ర‌తి నాయ‌కుడిగా..

Tue,February 19, 2019 09:14 AM
Prashant Narayanan plays crucial role in modi biopic

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’ . ఈ చిత్రంలోని పాత్ర‌ల‌కి సంబంధించిన లుక్స్‌ని ఒక్కొక్క‌టిగా ప‌రిచ‌యం చేస్తూ మూవీపై అంచ‌నాలు పెంచుతున్నారు మేక‌ర్స్‌. మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తుండ‌గా, ముఖ్య పాత్ర‌ల‌లో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు న‌టిస్తున్నారు. భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్ర‌ని మనోజ్ ‌జోషి చేస్తున్నాడు. మోదీ తల్లి హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ క‌నిపించ‌నుంది. ఇక భార్య‌ జశోదాబెన్‌ పాత్రని బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా చేస్తుంది. రీసెంట్‌గా వీరి లుక్స్ కూడా విడుద‌ల అయ్యాయి. తాజాగా చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న మ‌ర్డ‌ర్ 2 ఫేం ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న లుక్ చాలా కొత్త‌గా ఉంది. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏడాది ద్వితీయార్ధంలో ‘పీఎం నరేంద్రమోదీ’ బ‌యోపిక్ విడుద‌ల కానుంది. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం 23 భాష‌ల‌లో విడుద‌ల కానున్న‌ట్టు టాక్.

1573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles