పవన్ పవర్ ఫుల్ స్పీచ్ - వీడియో

Sun,March 19, 2017 07:46 AM

సినిమా ఫంక్షన్ లకు చాలా దూరంగా ఉండే పవన్ తన సినిమాల వేడుకలకి తప్ప మిగతా ఫంక్షన్స్ లో ఎక్కువగా కనిపించడు. ఈ మధ్య రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ అనేక సభలను నిర్వహించి ప్రసంగించాడు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ తన తాజా చిత్రం కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు కావడం, ఈ వేడుకలో ఆయన మాట్లాడడం అందరిని ఆనందానికి గురి చేసింది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకి పంచెకట్టుతోనే వచ్చాడు. పవన్ ని ఈ లుక్ లో చూసిన అభిమానులు తెగ మురిసిపోయారు.

కెరీర్ లో 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులో దాగి ఉన్న మాటలను కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివరించాడు పవన్. సినిమాలో జరిగినవే తన జీవితంలో జరిగాయని అది యాదృచ్చికమో మరొకటే తెలియదంటూ చేసిన ప్రతీ సినిమాకి.. తన జీవితంలో లింక్ ఏంటో విపులీకరిస్తూ వివరించాడు. పవన్ చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికి తనకు గుర్తుండడం, తన తండ్రి మాటలను స్పూర్తి తీసుకోవడం, ఇలా ఎన్నో విషయాలపై చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు పవన్. మరి పవన్ ఇచ్చిన పవర్ ఫుల్ స్పీచ్ పై మీరు ఓ లుక్కేయండి.

1541

More News

మరిన్ని వార్తలు...