300 మంది పిల్ల‌ల చ‌దువుకు పూర్తి బాధ్య‌త నాదే: నిఖిల్

Wed,June 26, 2019 08:43 AM
nikhil helps to 300 Little Kids in Bheemavaram

యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాయి. ఆయ‌న న‌టించిన అర్జున్ సుర‌వరం చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం కార్తికేయ చిత్ర సీక్వెల్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెర‌కెక్కించ‌నున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించ‌నుంది. అయితే సినిమా విష‌యాల‌ని ప‌క్క‌న పెడితే నిఖిల్‌లో మంచి మాన‌వ‌త్వం దాగుంద‌నే విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది. ఆప‌ద‌లో ఉన్న వారికి ప‌లుమార్లు సాయం చేసిన నిఖిల్ తాజాగా భీమవరంకి చెందిన 300 మంది విద్యార్ధుల చ‌దువుకి అయ్యే ఖ‌ర్చు అంతా తాను భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. వారు పాఠ‌శాల‌కి వెళ్ళ‌డం నుండి చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని నేనే చూసుకుంటాన‌ని నిఖిల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఇలాంటి బృహ‌త్కార్యంలో భాగ‌స్వామిని చేసిందుకు మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ అని నిఖిల్ పేర్కొన్నారు .


1086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles