నాని మరో సినిమాకి టైటిల్ ఫిక్స్..!

Fri,April 21, 2017 01:55 PM
nea title fixed for nani next movie

వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న నాని మరో సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ వంటి సూపర్ హిట్ విజయాన్ని తనకు అందించిన హను రాఘవపూడితో ఈ నేచురల్ స్టార్ త్వరలో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. నాని ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం లో నివేదా థామస్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ వరకు ఈ చిత్ర షూటింగ్ ని పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేసి జూలై 12న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే నాని దిల్ రాజు నిర్మాణంలో ఎంసీఏ అనే చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడు. అక్టోబర్ వరకు ఈ చిత్రాన్ని పూర్తి చేసి వెంటనే హను రాఘవపూడి తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ కోసం పని చేయనున్నాడు నాని. ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి ‘అదిగో అల్లదిగో’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. హను రాఘవపూడి ప్రస్తుతం నితిన్ హీరోగా లై అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS