స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానున్న న‌ర‌కాసురుడు

Fri,February 15, 2019 01:19 PM
Narakaasurudu  Releasing this Summer in both Telugu and Tamil

అరవింద్ స్వామి.. సందీప్ కిషన్.. శ్రీయ.. మరియు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో న‌ర‌గ‌సూర‌న్ అనే చిత్రం త‌మిళంలో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రం న‌ర‌కాసురుడు అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. కార్తిక్ నారేన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఎప్పుడో తను చేసిన తప్పుడు పనులన్నీ మానేసిన ఒక మాఫియా డాన్.. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కి వస్తే ఏంటి పరిస్థితి అనే నేపథ్యంలో.. ఒక థ్రిల్లర్ తరహాలో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన విడుద‌ల విష‌యంలో కాస్త జాప్యం జ‌రిగింది. గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో చిత్ర ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా చిత్ర పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఈ మూవీని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌ను రమేష్‌ వర్మ ప్రొడక్షన్‌ లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా విడుదల చేయనున్నారు.

1260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles