నన్ను దోచుకుందువ‌టే మేకింగ్ వీడియో

Sun,September 23, 2018 11:46 AM
Nannu Dochukunduvate Movie Making video released

స‌మ్మోహ‌నం చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు త‌న‌ తాజా చిత్రం నన్ను దోచుకుందువ‌టే మూవీతో మరో హిట్ కొట్టాడు . ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, చిత్రంలో సుధీర్ బాబు కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించాడు. హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించింది. కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటించ‌గా ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందించారు . సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా చేసిన‌ నన్ను దోచుకుందువ‌టే సినిమా మంచి హిట్ కావ‌డంతో చాలా సంతోషంగా ఉన్నాడు. మ‌హేష్ బాబుతో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో వైవా హ‌ర్ష డైరెక్ట‌ర్‌గా, సుధీర్ బాబు న‌టుడిగా ఫ‌న్ జ‌న‌రేట్ చేశారు. సాంగ్స్‌కి సంబంధించిన కొన్ని స‌న్నివేశాలు కూడా చూపించారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles