విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రంలో న‌టిస్తున్న స్టార్ డైరెక్ట‌ర్‌

Wed,September 12, 2018 10:21 AM
murugadoss actor in nota

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా 'నోటా' సినిమా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతి వేలుపై ఓటేసిన సిరా గుర్తుతో కనిపించిన విజ‌య్ తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌లో స‌రికొత్త‌గా క‌నిపించాడు. సాధార‌ణ యువ‌కుడిగాను, ముఖ్య‌మంత్రిగాను ట్రైల‌ర్‌లో క‌నిపించాడు విజ‌య్ దేవ‌రకొండ‌. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స‌త్య‌రాజ్‌, ముఖ్య పాత్ర‌ల‌లో అద‌ర‌గొట్ట‌నున్నారు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 4న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

నోటా చిత్రంలో స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ అతిధి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ద‌ర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ని తెర‌కెక్కించిన మురుగ‌దాస్ న‌టుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని తెలిసే స‌రికి అభిమానులు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. నోటా చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ గ‌తంలో మురుగదాస్ ద‌గ్గ‌ర ప‌లు చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ఇప్ప‌డు ఆయ‌న‌ని డైరెక్ట్ చేస్తుండడం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్టు ఆనంద్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి త‌మిళంలోను మంచి క్రేజ్ ఉండ‌డంతో పాటు మురుగ‌దాస్ చిత్రంలో న‌టిస్తుండే స‌రికి మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి.

3311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles