డాటర్స్ డే స్పెషల్.. వైరల్‌గా మారిన ఇషా, ముఖేశ్ అంబానీ వీడియో

Sun,September 23, 2018 05:53 PM
Mukesh Ambani Walks Daughter Isha ambani at Engagement Party

రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్ నిన్న ఇటలీలో ఎంతో వైభవంగా జరిగింది. ఆల్ఫ్స్ పర్వత ప్రాంతం పరిసరాల్లో ఉన్న లేక్ కొమో వద్ద వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద పిరమాల్‌ను ఇషా పెళ్లి చేసుకోబోతున్నది. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. వీళ్ల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇవాళ డాటర్స్ డే సందర్భంగా ముఖేశ్ అంబానీ.. ఇషా చేయిని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లి ఆనంద్‌కు అందిస్తాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాళ్ల వెనుక ఇషా సోదరుడు ఆకాశ్, అతడి కాబోయే భార్య శ్లోకా ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నడుస్తూ వెళ్లారు. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ జంట, కరణ్ జొహార్, మనిష్ మల్హోత్రా, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా జంట, జాన్వీ కపూర్ హాజరయ్యారు.


4147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles