నాకు అలా లవ్ చేయడం చేతగాదు.. మిస్టర్ మజ్ను ట్రైలర్

Sat,January 19, 2019 09:32 PM

అక్కినేని అఖిల్ న‌టించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో అఖిల్ తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను అయినా హిట్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా, జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం థ‌మ‌న్ అందిస్తున్నారు.


ఇప్పటికే రిలీజయిన టీజర్, టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించగా.. తాజాగా మూవీ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా సినిమా ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

2339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles