Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2018గా స‌మ్మోహ‌నం బ్యూటీ

Tue,March 19, 2019 01:45 PM
Most desirable woman 2018 is Aditi Rao Hydari

స‌మ్మోహ‌నం చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అందాల భామ అదితిరావు హైద‌రి. ఈ చిత్రంలో అదితి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. రీసెంట్‌గా అంత‌రిక్షం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్ 26వ చిత్రంలో క‌థానాయిక‌గా అదితి ఎంపికైంది . క‌ట్ చేస్తే అదితి రావు హైద‌రి మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మ‌డికి ద‌క్క‌గా రెండో స్థానంలో ఎఫ్‌బీబీ క‌ల‌ర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018 శ్రియా రావు నిలిచింది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూప్ తయారు చేసిన జాబితాలో స‌మంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2017 లో తొలి స్థానం ద‌క్కించుకున్న పూజా హెగ్డేకి ఈ సారి నాలుగో స్థానం ద‌క్కింది. ఐదు ర‌ష్మిక‌, ఎనిమిది కైరా అద్వానీ, తొమ్మిది ర‌కుల్‌, ప‌ద‌వ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ నిలిచింది.



2085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles