24 గంటలలో కోటి వ్యూస్ సాధించిన టీజర్

Fri,September 22, 2017 03:39 PM
24 గంటలలో కోటి వ్యూస్ సాధించిన  టీజర్

విజయ్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం మెర్సల్. రీసెంట్‌గా మూవీ టీజర్ విడుదల అయింది. అ చిత్ర టీజర్ మొదట ఎక్కువ లైక్‌లు సాధించిన టీజర్‌గా రికార్డు సాధించడంతో పాటు 24 గంటలలో కోటి వ్యూస్ సాధించిన టీజర్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ ట్విట్టర్ పేజ్‌లో రీరైటింగ్ ఆల్ రికార్డ్స్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ ద్వారా తెలిపారు. మెర్సల్ టీజర్ అభిమానులనే కాదు సెలబ్రిటీలను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో చిత్ర టీజర్ ఫుల్ వైరల్ అయింది. సమంత, నిత్యామీనన్, కాజల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను తెలుగులో నిర్మాత శరత్‌ మరార్‌ అదిరింది అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జే.సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, కోవైసరళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

2131

More News

VIRAL NEWS