'మ‌హ‌ర్షి' మేకింగ్ వీడియో విడుద‌ల‌

Tue,May 21, 2019 11:01 AM
Making of Maharshi video released

బాక్సాఫీస్‌ని షేక్ చేసిన మ‌హ‌ర్షి చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ రెండు వంద‌ల కోట్ల మార్క్‌ని చేరుకునేందుకు ఉరుకులు పెడుతుంది. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో మ‌హ‌ర్షిని మించిన సినిమా లేక‌పోవ‌డంతో ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. చిత్రంపై జ‌నాల‌లో ఆసక్తిని క‌లిగించేందుకు తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో గ్రామాన్ని నిర్మించ‌డంతో పాటు యాక్ష‌న్, త‌దిత‌ర స‌న్నివేశాల మేకింగ్స్ చూపించారు. ఈ వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. కొద్ది రోజులుగా చిత్ర సక్సెస్ మీట్ వేడుక‌ల‌లో పాల్గొన్న మ‌హేష్ త‌న ఫ్యామిలీతో విహార యాత్ర‌కి వెళ్ళాడు. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా చేయ‌నున్నాడు.

1480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles