మహేశ్-సుకుమార్ సినిమా జోనర్ మారిందా..?

Wed,January 16, 2019 08:48 PM
Maheshbabu, sukumar movie, Mahesh-sukumar

టాలీవుడ్ యాక్టర్ మహేశ్ బాబు, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణలో రజాకార్ల బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో పీరియాడిక్ సినిమాగా వస్తుందని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా జోనర్ మారినట్లు మరో వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ సుకుమార్ అండ్ టీం చిత్ర ఇతివృత్తంపై పలుదఫా చర్చలు జరిపిన తర్వాత..మహేశ్ తో రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే నెలలో మహేశ్ కుటుంబంతో కలిసి సమ్మర్ ట్రిప్ పూర్తయిన తర్వాత సుకుమార్ ప్రాజెక్టును జూన్ నుంచి షురూ చేయనున్నట్లు సమాచారం.

3153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles