డేరింగ్ హీరో అనిపించుకున్న మహేష్..!

Fri,April 21, 2017 03:19 PM
mahesh proved as daring hero

సాంగ్స్, ఫైట్స్ మూవీ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదేమో..? ఏ సినిమా చూసినా ఏముంది? ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ కదా? అని ఎగతాళిగా కూడా అంటుంటారు. యాక్షన్ మూవీస్ లోనే కాదు .. మామూలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో కూడా ఫైట్స్ ఉంటున్నాయి. ఫైట్స్ చూడ్డానికి ఎంత థ్రిల్లింగా ఉంటాయో వాటిని తీయడంలో అంత రిస్క్ కూడా ఉంది. చాలామంది హీరోలు హీరోయిన్స్ తో అందంగా డ్యూయెట్స్ పాడతారు కానీ డూప్స్ లేకుండా ఫైట్స్ చేయలేరు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు చాలా రిస్క్ తీసుకుని ఫైట్స్ చేశాడట.

మహేష్ బాబు – డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా స్పైడర్. ఈ సినిమాలో ఫైట్స్ చాలా హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. కొన్ని సీన్స్ ను ఫైట్స్ కోసం కేటాయించారని, ఆ ఫైట్స్ చాలా డేంజరస్ గా ఉంటాయని తెలిసింది. వాటిని చేయడానికి డూప్స్ కూడా భయపడ్డారట. అలాంటిది ప్రిన్స్ మహేష్ బాబు వాటిని తనే స్వయంగా చేశాడట.

ఆ ఫైట్స్ కోసం రిస్క్ తీసుకోవద్దని డూప్ప్ కూడా మహేష్ బాబుకు సలహా ఇచ్చారట. కానీ డేరింగ్ హీరో మహేష్ బాబు వినలేదు. డూప్స్ అవసరం లేదని, తనే చేస్తానని ముందుకొచ్చి చేశాడట. అతని డేరింగ్ చూసి డూప్స్ కూడా స్టన్ అయ్యారట. ఎంతైనా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ కొడుకు కదా మరి?. అయితే స్పైడర్ సినిమా కోసం మహేష్ చేసిన ఫైట్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు.

1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS