గీత గోవిందంకి ప్ర‌శంస‌లే కాదు కలెక్షన్స్ కూడా..

Thu,August 16, 2018 12:41 PM
mahesh praise geetha govindam team

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన గీత గోవిందం చిత్రం ఊహించిన‌ట్టుగానే భారీ విజ‌యం సాధించింది. అభిమానులు ఈ సినిమా థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరారు. సెల‌బ్రిటీలు చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే చిరు, రాజ‌మౌళి గీత గోవిందంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌గా, తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు టీంని ఆకాశానికి ఎత్తేశారు. గీత గోవిందం విన్నర్.. సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. విజయ్ ,రష్మిక నటన బ్రిలియంట్ గా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ, సుబ్బ‌రాజు న‌ట‌న‌ కూడా చాలా బాగుంది. గీత గోవిందం టోటల్ టీమ్ కు నా కంగ్రాట్స్ అని మహేష్ పోస్ట్ చేసారు. మహేష్ ట్వీట్ కు స్పందిస్తూ హీరోయిన్ రష్మిక ‘థ్యాంక్యూ సర్’ అని రీ ట్వీట్ చేసింది.

అర్జున్ రెడ్డి త‌ర్వాత గీత గోవిందం చిత్రంలో పూర్తి విరుద్ధమైన గెటప్‌లో కనిపించి సంద‌డి చేశాడు విజ‌య్ . ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. మ‌న రాష్ట్రంలోనే కాదు ఓవ‌ర్సీస్‌లోను ఈ చిత్రానికి భారీ క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. ప్రీమియ‌ర్స్ ద్వారా మంగళవారం రోజే 4 లక్షల డాలర్లను గీత గోవిందం రాబట్టింది. బుధవారం నాటికి ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. పాజిటివ్ టాక్ రావడంతో.. గోవిందుడు తొలి వారం ముగిసే సరికి మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరతాడని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలు కూడా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి.3895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS