మహేష్ కి పోటీ ఇవ్వబోతున్న నాని

Fri,April 21, 2017 05:01 PM
mahesh fight with nani

సూపర్ స్టార్ మహేష్ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్వకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్పైడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో మహేష్ గూడాఛారిగా కనిపించనున్నాడు. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇదే తేదీన నాని నటిస్తున్న నిన్ను కోరి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తాజాగా టీం ప్రకటించింది.

నాని ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం లో నివేదా థామస్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో భారీ షెడ్యూల్ జరుపుకున్న నిన్ను కోరి చిత్ర యూనిట్ ఏప్రిల్ 17 నుండి వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఏప్రిల్ 29 వరకు నిన్ను కోరి చిత్ర ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ అంతా పూర్తవుతుందట. వరల్డ్ వైడ్ గా జూన్ 23న ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత డివివి దానయ్య తెలిపాడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. మరి ఒకే రోజు ఇటు నాని అటు మహేష్ సినిమాలు పోటి పడనున్న నేపధ్యంలో బాక్సాఫీస్ వద్ద బడా ఫైట్ నెలకొనేలా కనిపిస్తుంది.

1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS