మ‌హేష్ మూవీ టీజ‌ర్‌కి టైం ఫిక్స‌యిందా ?

Sun,January 20, 2019 07:35 AM

మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో మ‌హ‌ర్షి అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 26కి పోస్ట్ పోన్ అయింద‌ని టాక్‌. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి. అయితే మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌. దీనిపై అఫీషియ‌ల్ క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ప్ర‌స్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో అబుదాబికి వెళ‌తార‌ట‌. అక్క‌డ కీల‌క స‌న్నివేశాల‌ని తెర‌కెక్కించి ఆ త‌ర్వాత గుమ్మ‌డికాయ కొట్ట‌నున్నార‌ని స‌మాచారం. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై మహేశ్ ఓ సినిమా చేయ‌నున్న సంగతి తెలిసిందే.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles