HomeFeatured News leonardo dicaprio comments on chennai water problem

వర్షం మాత్ర‌మే చెన్నైని ర‌క్షించ‌గ‌ల‌దు:హాలీవుడ్ హీరో

Published: Wed,June 26, 2019 11:45 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
leonardo dicaprio comments on chennai water problem నీటి స‌మస్య‌తో చెన్నై ప్ర‌జ‌లు అల్ల‌ల్లాడుతున్నారు. కొద్ది రోజులుగా తాగ‌డానికి నీరు కూడా లేక‌పోవ‌డంతో అక్క‌డ తీవ్ర సంక్షోభం నెల‌కొంది. కొంద‌రు ట్యాంకర్ల ద్వారా చెన్నై నగర ప్రజలకి సాయం అందిస్తున్నారు. త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌ని స్వామి రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించారు. దేశంలోని ఆరో పెద్ద న‌గ‌రం చెన్నైకి ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఊహించ‌లేదంటూ ప‌లువురు చెబుతున్నారు. ప్ర‌ముఖ హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో కూడా ఈ విష‌యంపై స్పందించారు. బావి ద‌గ్గ‌ర నీటి కోసం వేచి చూస్తున్న మ‌హిళ‌ల‌కి సంబంధించిన ఫోటో కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో ఆ ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేస్తూ.. వ‌ర్షం మాత్ర‌మే చెన్నైని ఈ ప‌రిస్థితి నుండి ర‌క్షించ‌గ‌ల‌దు అని అన్నారు. అంతేకాదు అక్క‌డి ప‌రిస్థితుల‌ని కూడా వివ‌రించారు.

చెన్నై న‌గ‌రం నీరు లేని న‌గ‌రంగా మారింది. బావులు అన్ని ఖాళీ అయ్యాయి. నాలుగు ప్రధాన నీటి జలాశయాలు పూర్తిగా ఎండిపోయిన తరువాత దక్షిణ భారత నగరం చెన్నై సంక్షోభంలో ప‌డింది. నీటి కొర‌త న‌గ‌ర ప్ర‌జ‌ల‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అత్య‌వ‌స‌రాల ప‌రిష్కారాల కోసం పెనుగులాట జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం, నిర్వాసితులు అందించే నీళ్ళ కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌స్తుంది. నీటి మట్టాలు క్షీణించడంతో, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మెట్రోలో ఏసీ వినియోగం ఆపేశారు. అధికారులు నీటి కోసం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ని అన్వేషిస్తూనే ఉన్నారు. కొంద‌రు నీటి కోసం ప్రార్ద‌న‌లు చేస్తూనే ఉన్నారు అని లియోనార్డో త‌న పేజ్‌లో పేర్కొన్నారు. మ‌రి చెన్నై ప్ర‌జ‌ల నీటి క‌ష్టం ఎప్ప‌టికి తీరుతుందో చూడాలి.

View this post on Instagram

#Regram #RG @bbcnews: "Only rain can save Chennai from this situation." A well completely empty, and a city without water. The southern Indian city of Chennai is in crisis, after the four main water reservoirs ran completely dry. The acute water shortage has forced the city to scramble for urgent solutions and residents have to stand in line for hours to get water from government tanks. As the water levels depleted, hotels and restaurants started to shut down temporarily, and the air con was turned off in the city's metro. Officials in the city continue to try and find alternative sources of water - but the community continue to pray for rain. Tap the link in our bio to read more about Chennai's water crisis. (📸 Getty Images) #chennai #watercrisis #india #bbcnews

A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on

1143

More News

© 2011 Telangana Publications Pvt.Ltd