ప్ర‌భాస్ పెళ్ళిపై చిన్న క్లూ ఇచ్చిన కృష్ణం రాజు

Sun,January 20, 2019 10:03 AM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్ పెళ్ళి వేడుక గురించి కొన్నాళ్ళుగా ఎలాంటి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అనుష్క‌- ప్ర‌భాస్‌ల వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ఆంధ్రా అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడ‌ని జోస్యాలు చెప్పారు. అయితే నేడు కృష్ణం రాజు బ‌ర్త్‌డే కావడంతో, ఆయ‌న ఓ దిన‌ప‌త్రిక‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చి ప్ర‌భాస్ పెళ్ళిపై ఉన్న ప‌లు అనుమానాలు తొల‌గించారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన ప్ర‌భాస్ పెళ్లి గురించి న‌న్ను చాలా మంది అడుగుతున్నారు. సాహో సినిమా విడుద‌ల కాగానే పెళ్ళి వేడుక ఉంటుంద‌ని కృష్ణం రాజు అన్నారు. అంతే కాదు త్వరలోనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో లవ్ స్టోరీ నిర్మిస్తామని, అందులో తాను కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నానని చెప్పారు రెబ‌ల్ స్టార్. 50 సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో ఉన్న నేను, అప్ప‌ట్లో హీరోల మ‌ధ్య ఎలాంటి స‌త్సంబంధాలు ఉండేవో ఇప్పుడు అటువంటి సంబంధాలు చూస్తున్నాను అని వ్యాఖ్యానించారు. తనకు ఎస్వీ రంగారావు బయోపిక్ ను చూడాలని ఉందని, ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తే బాగుంటుందని ఈ సంద‌ర్భంగా తెలియజేశారు.

7625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles