విజ‌య్ ఆంటోని 'కొలైకార‌న్' మూవీ టీజ‌ర్‌

Thu,March 21, 2019 08:38 AM
Kolaigaran  Sneak Peek Teaser released

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో విజ‌య్ ఆంటోని ప్ర‌స్తుతం నెగెటివ్ పాత్ర‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. కొలైకార‌న్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, సీత, వీటీవీ గణేశ్‌లు నటిస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసారు. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఇది మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న థ్రిల్ల‌ర్ మూవీగా తెలుస్తుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా అర్జున్ న‌టిస్తుండ‌గా, విజ‌య్ ఆంటోని పాత్ర కాస్త భిన్నంగా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఆండ్రూ అయిస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles