‘విరుష్క’కు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి

Mon,June 18, 2018 08:55 PM
kiran rijiju backs Virushka viral vedio on waste

ముంబై : రోడ్డుపై చెత్త వేశాడని అర్హాన్ సింగ్ అనే వ్యక్తికి బాలీవుడ్ నటి అనుష్క శర్మ నడిరోడ్డుపైనే చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. అనుష్క ప్రవర్తనపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అనుష్క..రోడ్డుపై వెళ్లే వారినే కాదు, మైదానంలో నోటికొచ్చినట్లు మాట్లాడే నీ భర్త విరాట్‌ను అదుపులో పెట్టుకో అని ఒకరు కామెంట్స్ చేయగా..మీరు సెలబ్రిటీలు..నోటికొచ్చినట్లు మాట్లాడతారని మరో వ్యక్తి కామెంట్లు పెట్టాడు. అయితే ఈ విషయంలో విరుష్కకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మద్దతుగా నిలిచారు.

‘విరాట్ కోహ్లీ, అనుష్కకు ప్రైవసీ కావాలని వేడుకుంటూంటారు. విరుష్కకు పబ్లిసిటీ కావాలా? మనం చేసే పని మన స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. డబ్బు, చదువుతో సామాజిక విలువలు రావు. సమాజం పట్ల మన ఆలోచనా విధానాన్ని బట్టి వస్తాయి. భారత్‌ను శుభ్రంగా ఉంచాలని’ కిరణ్ రిజిజు ట్వీట్‌ చేశారు.
3165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles