మ‌రో తెలుగు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న కీర్తి సురేష్‌

Wed,March 20, 2019 11:35 AM

మ‌హాన‌టి సినిమాతో న‌టిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన కీర్తి సురేష్ త్వ‌ర‌లో మ‌రో తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మించ‌నుండ‌గా, న‌రేంద్ర‌నాథ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కానున్నాడు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఇందులో న‌టీన‌టుల వివ‌రాలు వెల్ల‌డించారు. రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నదియా .. కమల్ కామరాజు .. భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ఇదిలా ఉంటే అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా ఓ సినిమా తెర‌కెక్కుతుంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. జూన్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంతో కీర్తి బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టనుంది.

2949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles