ఎందుకు విడిపోయామన్న బాధ లేదు..

Wed,June 19, 2019 08:27 PM
katrina kaif sharing her relations with media

ప్రేమ, బ్రేకప్ కు సంబంధించిన విషయాలు ఏ యాక్టర్లు దాచినా..కత్రినాకైఫ్ మాత్రం తన ప్రేమ వివరాలను మాత్రం బాహాటంగానే చెప్పింది. తన ప్రేమ అంశం మీడియాకు ఆసక్తిగా అనిపిస్తుంటుంది కాబట్టే ఆ విషయం మాట్లాడుతుంటానంటోంది కత్రినా. సల్మాన్, కత్రినాకైఫ్ కాంబోలో భారత్ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్ లో పలు విషయాలు వెల్లడించింది కత్రినా. నా లవ్ విషయంపై మీరు (మీడియా) ప్రశ్నలు అడుగుతుంటే..జవాబివ్వకుండా తప్పించుకోలేకపోతున్నా. మీ ప్రశ్నకు నేను సమాధామివ్వకపోతే బిరుసుగా ప్రవర్తించినట్లవుతుంది. రణ్ బీర్ కు, నాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. రణ్ బీర్ తో విడిపోయినపుడు నా సోదరి కూడా ప్రేమలో విఫలమైంది. నేను సెలబ్రిటీని కాబట్టి నాకు తగిలిన గాయం ఎక్కువ బాధిస్తుందని తెలిసింది. ఆ తర్వాత పుస్తకాలు చదువుతూ బాధలో నుంచి బయటపడ్డా. నా ఫ్రెండ్స్ ఎంతో అండగా నిలిచారు. అయితే ఎందుకు విడిపోయామా? అనే బాధ మాత్రం లేదని చెప్పుకొచ్చింది కత్రినా.

4388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles