ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో క‌త్తి సెల్ఫీ.. వివాదం ముగిసిన‌ట్టేనా..!

Sat,January 20, 2018 11:47 AM
kathi mahesh and pawan fans take a selfie

గ‌త నాలుగు నెల‌ల నుండి అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కి, ఇటు క‌త్తి మ‌హేష్‌కి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లే కాదు ఈ వివాదం కోడిగుడ్ల దాడి వ‌ర‌కి వెళ్ళింది. ఇటీవ‌ల క‌త్తి మ‌హేష్ కారులో వెళుతుండ‌గా ఆయ‌న‌పై ఇద్దరు వ్య‌క్తులు కోడిగుడ్ల‌తో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై దాడి చేసిన వారిపై మాదాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ కూడా చేశాడు. క‌ట్ చేస్తే క‌త్తి మ‌హేష్ తాను ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకోవ‌డ‌మే కాదు ప‌వ‌న్ అభిమానుల‌తో క‌లిసి స్వీట్స్ తిని సెల్ఫీలు కూడా దిగార‌ట‌. ఈ నేప‌థ్యంలో క‌త్తి మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య వైరం ముగిసిన‌ట్టేన‌ని అంటున్నారు. అయితే అంత‌క ముందు ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ప‌వ‌న్ నుండి, అత‌ని పార్టీ నుండి రెండు ప్రెస్ నోట్లు రిలీజ్ అయ్యాయి. ఎవ‌రు విమ‌ర్శ‌లు చేసిన, వాటిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ఓర్పే ల‌క్ష్యంగా ముందుకు పోదామ‌ని ఆ నోట్‌లో తెలిపారు. అస‌లు క‌త్తి మ‌హేష్ కాస్త వెన‌క్కి త‌గ్గ‌డానికి కార‌ణం .. పవన్ అభిమానులు కొందరు రంగంలోకి దిగి, కత్తితో చర్చలు జరిపడం, అదే సమయంలో పవన్ నుంచి లేఖ విడుదల కావటం అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే క‌త్తి మహేష్ ..పవన్ సినిమా.. రాజకీయాలకు సంబంధించిన విమర్శలు చేస్తానని.. వ్యక్తిగత విమర్శలు మాత్రం తాను చేయనని కత్తి ప్రకటించాడు. ఇది వెన‌క్కి త‌గ్గ‌డం కాదు, మ‌నిషిగా ఎద‌గడం అని అంటున్నాడు.5180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS