ఇద్ద‌రు భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌నున్న ఆర్ఎక్స్ 100 హీరో

Tue,November 13, 2018 11:54 AM
Kartikeya To Romance Two Heroines In His Next

త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన కార్తికేయ‌, పాయ‌ల్‌కి వ‌రుస ఆఫర్స్ వ‌స్తున్నాయి. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు. బైలింగ్యువ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతుంది . తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనుండ‌గా, ఈ చిత్రంలో కార్తికేయ బాక్స‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తికేయ స‌ర‌స‌న ముంబై భామ‌లు దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ లని క‌థానాయిక‌లుగా ఫైన‌ల్ చేశార‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

2218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles