బ‌ర్త్ డే పార్టీలో క‌రీనా, కరిష్మా సంద‌డి

Fri,April 21, 2017 04:39 PM
బ‌ర్త్ డే పార్టీలో క‌రీనా, కరిష్మా సంద‌డి

కపూర్ ఖాన్ దాన్ లో ఏ పార్టీ అయిన జరిగిందంటే చాలు ఆ ఫ్యామిలీ అంతా అక్కడ ప్రత్యక్షం కావడం కామన్. రీసెంట్ గా బబిత కపూర్ 70వ జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ పుట్టిన రోజు వేడుకకి బబిత డాటర్స్ కరీనా, కరిష్మా కపూర్ లతో పాటు సైప్ అలీ ఖాన్, నీతు, రిషీ కపూర్ హాజరయ్యారు. ఈ పార్టీలో సైఫ్- కరీనా స్పెషల్ ఎట్రాక్షన్ కాగా వారి గారాల పట్టీ తైమూర్ గైర్హాజరు అయ్యాడు. బబిత రెసిడెన్స్ లోకి ఎంటర్ అయ్యే మందు సైప్- కరీనా కపుల్ ఆనందంగా కెమెరాకి ఫోజులిచ్చారు. మరో విశేషమేంటే బర్త్ డే పార్టీకి కరీష్మా తన కిడ్స్ సమైరా కపూర్ , కియాన్ రాజ్ కపూర్ తో హాజరైంది. ఇక ఈ పార్టీలో బబిత భర్త రణ్ ధీర్ కపూర్, రిషి కపూర్, నీతూ కపూర్, రాజ్ కపూర్ డాటర్ రీమా జైన్ ఆమె భర్త మనోజ్ కుమార్ అర్మాన్ లు సందడి చేశారు. రణబీర్ కపూర్.. సంజయ్ దత్ బయోపిక్ తో బిజీగా ఉండడం వలన ఈ పార్టీకి హాజరు కాలేదని తెలుస్తుంది. ఫిబ్రవరిలో రణ్ ధీర్ కపూర్ 70వ బర్త్ డే పార్టీని ఫ్యామిలీ అంతా గ్రాండ్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి కపూర్ ఖాన్ దాన్ అంతా హాజరయ్యారు. రణ్ ధీర్ కపూర్ వైఫ్ బబిత 1966లో దుస్ లఖ్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసింది. 1971లో రణ్ ధీర్ కపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత బబిత సినిమాలకు దూరంగా ఉంది.
#celebrating70 🎉🎉#ourmama#weloveyou❤️ #happybirthday#aboutlastnight✨#celebrations🎊#familylove

A post shared by KK (@therealkarismakapoor) on


1138

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018