ఎగ‌తాళి చేసిన మ‌హిళ‌కి త‌నదైన‌ స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చిన క‌ర‌ణ్‌

Sat,February 16, 2019 09:42 AM

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ మ‌హిళా నెటిజన్ క‌ర‌ణ్‌ని కాస్త ఎగ‌తాళి చేసిన‌ట్టు మాట్లాడింది. స‌రోగ‌సీ ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన మీరు వారికి త‌ల్లి ప్రేమ‌ని దూరం చేస్తున్నారంటూ ట్వీట్‌లో తెలిపింది. దీనికి కాస్త నొచ్చుకున్న క‌ర‌ణ్ ఆ మ‌హిళ‌కి త‌న‌దైన స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చాడు. దేశంలో ప‌ట్టించుకోవ‌ల‌సి సమ‌స్య‌లు చాలా ఉన్నాయి. ఇలాంటి మాట‌ల‌తో స‌మ‌యాన్ని వృదా చేసే బ‌దులు వాటి కోసం స‌మ‌యం కేటాయించండి. నా పిల్ల‌లకి త‌ల్లి ప్రేమ ద‌క్కుతోంది. ఆ విష‌యంలో మీరు ఇబ్బంది ప‌డాల్సిన ప‌ని లేదు. మా అమ్మే నా పిల్ల‌ల‌కి త‌ల్లి. అర్ధ‌మైందా ? అని ట్వీట్ ద్వారా బ‌దులిచ్చాడు క‌ర‌ణ్ జోహార్‌. స‌రోగ‌సి ద్వారా జ‌న్మించిన పిల్ల‌లకి య‌ష్‌, రూహీ అనే పేర్లు పెట్టాడు క‌ర‌ణ్. 2017 ఫిబ్ర‌వ‌రిలో వీరు జ‌న్మించ‌గా రీసెంట్‌గా రెండవ బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ తక్త్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్‌, క‌రీనా క‌పూర్, జాన్వీ క‌పూర్, విక్కీ కౌశ‌ల్‌, భూమి ప‌డ్నేక‌ర్‌, అనీల్ క‌పూర్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.4068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles