కమల్ సోదరుడు ఇక లేరు

Sun,March 19, 2017 10:22 AM

గత వారం రోజులుగా సినీ పరిశ్రమలోని ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు మృత్యువాత పడుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న దిల్ రాజు సతీమణి గుండెపోటుతో మరణించడం ఆ తర్వాత జయసుధ భర్త నితిన్ ఆత్మహత్య చేసుకోవడం.. ఇక రీసెంట్ గా ఐశ్వర్యరాయ్ కి పితృ వియోగం జరగడం ఇలా వరుస సంఘటనలు ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇక తాజాగా కమల్ హాసన్ సోదరుడు చంద్ర హాసన్ కన్నుమూశారు అనే వార్త అందరిని షాక్ కి గురి చేసింది. 18న రాత్రి చంద్ర హాసన్ (82) గుండెపోటుతో మరణించినట్టు కోలీవుడ్ టాక్. ఇటీవల చంద్ర హాసన్ సతీమణి గీతామణి కూడా కన్ను మూసారు. చంద్ర హాసన్ తన కుమార్తె అను హాసన్ దగ్గర ఉంటూ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క భాద్యతలను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. చంద్ర హాసన్ నిర్మాణంలో కమల్ హీరోగా కొన్ని సినిమాలు రూపొందాయి. నల దమయంతి, విరుమంద, విశ్వరూపం, ఉత్తమ విలన్ వంటి చిత్రాలు ఆయన నిర్మాణంలో తెరకెక్కినవే. కమల్ తాజా చిత్రం శభాష్ నాయుడుకి కూడా చంద్ర హాసనే నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించాడని అంటున్నారు.

2395

More News

మరిన్ని వార్తలు...