ఇద్దరు తనయులతో ఎన్‌టీఆర్ ఫొటో సెషన్

Mon,June 18, 2018 02:20 PM
Junior NTR clicked photo of his two sons

జూనియర్ ఎన్‌టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో అరవింద సమేత అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దసరాకు ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఓవైపు సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే, మరో వైపు జూనియర్ ఎన్‌టీఆర్ తన కుటుంబంతో గడిపేందుకు కూడా చాలా సమయాన్నే కేటాయిస్తున్నాడు.

జూనియర్ ఎన్‌టీఆర్ ఇటీవల జన్మించిన తన చిన్న కుమారుడితోపాటు, పెద్ద కుమారుడు అభయ్‌లతో కలసి కొంత సేపు వారిని ఫొటోలు తీస్తూ గ‌డిపాడు. అందులో భాగంగా తన రెండో కుమారున్ని పెద్ద కుమారుడు ఎత్తుకుని ఉండగా జూనియర్ ఎన్‌టీఆర్ ఫొటో తీశాడు. ఆ ఫొటోను ఎన్‌టీఆర్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో షేర్ చేయగా, ఆ ఫొటోకు ప్రస్తుతం అభిమానుల నుంచి మంచి స్పందన వస్తున్నది. లవకుశలు ఇద్దరూ సూపర్‌గా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్‌టీఆర్‌కు ఇటీవలే రెండో కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన ఇద్దరు తనయులతో కలిసి ఎన్‌టీఆర్ ఇలా తన ఖాళీ సమాయన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

2834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS