సూపర్‌ హిట్‌ పెయిర్‌ జంటగా ‘బెలూన్‌’

Sat,August 13, 2016 12:39 PM
JAI, ANJALI new movie BALLOON

జై, అంజలి జంటగా నటించిన ‘జర్నీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌ గా నిలిచింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో 70 ఎంఎం ఫిలిం స్‌ పతాకంపై టిఎన్‌ అరుణ్‌ బాలాజీ కందసామి నంద కుమార్‌ నిర్మిస్తున్న ‘బెలూన్‌’ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ‘మర్యాద రామన్న’ ఫేం నాగినీడు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా తనదైన శైలిలో బాణీలు రెడీ చేస్తున్నారు.

తెలుగులో 17 చిత్రాలు డైరెక్ట్‌ చేసి అందులోనూ సూపర్‌స్టార్‌ కృష్ణతో 13 చిత్రాలకు దర్శకత్వం వహించి ‘అసాధ్యుడు’, ‘దేవుడుచేసిన మనుషులు’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటి ఎన్నో సూపర్‌హిట్స్‌ ఇచ్చిన లెజెండ్రీ డైరెక్టర్‌ వి.రామచంద్రరావు. ఆయన మనవరాలిని వివాహం చేసుకున్న ఎస్‌. శినీష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు శినీష్‌ ‘బెలూన్‌’ గురించి మాట్లాడుతూ .. కొడైకెనాల్‌లో షూటింగ్‌ జరుపుకునే రొమాంటిక్‌ హర్రర్‌ మూవీ ‘బెలూన్‌’. ఈ చిత్రం జై, అంజలి కెరీర్స్‌ లో మరో మైల్‌స్టోన్‌ అవుతుంది అని తెలిపాడు. 1989 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్‌ హర్రర్‌ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది.

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles