మ‌హేష్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టిన అనీల్ రావిపూడి..!

Tue,February 19, 2019 08:21 AM

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు భ‌ర‌త్ అనే నేను చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా ఆయ‌న‌కి మంచి విజ‌యాన్ని అందించింది. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ చేయ‌బోవు ప్రాజెక్ట్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనో లేదంటే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలోనో ఉండొచ్చ‌నే టాక్స్ వినిపిస్తున్నాయి.


పటాస్‌, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 ఇలా వ‌రుస హిట్స్ తో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి ఈ మ‌ధ్య మ‌హేష్‌ని క‌లిసి ఓ స్టోరీ లైన్ వినిపించ‌గా, అది మ‌హేష్‌కి న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ చేద్దామ‌ని మాట ఇచ్చాడ‌ట‌.దీంతో ఈ మూవీకి వాట్సాప్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఛాంబ‌ర్‌లో కూడా రిజిస్ట‌ర్ చేయించాడ‌ని అంటున్నారు. దిల్ రాజు, అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌ని టాక్. మ‌రి ఈ విష‌యాల‌పై అతి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles