గుణ 369 టీజ‌ర్‌కి టైం ఫిక్స్

Sun,June 16, 2019 07:17 AM
 Guna 369 teaser time fixed

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ హీరో కార్తికేయ రీసెంట్‌గా హిప్పీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. తాజాగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో గుణ 369 అనే చిత్రం చేస్తున్నాడు . ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఇటీవ‌ల గుణ 369 చిత్రానికి సంబంధించి కార్తికేయ‌ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో చాలా కూల్‌గా పంచెకట్టుతో క‌నిపిస్తున్నాడు. ఇక చిత్ర టీజ‌ర్‌ని జూన్ 17న విడుద‌ల చేస్తున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles