భయపడుతున్న మల్టీప్లెక్స్ థియేటర్లు !

Sat,January 20, 2018 01:31 PM
భయపడుతున్న మల్టీప్లెక్స్ థియేటర్లు !

అహ్మాదాబాద్: పద్మావత్ రిలీజ్‌కు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చాయి. ఆ సినిమాకు సుప్రీం కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కినా.. ఇప్పుడు కొత్తగా ఎగ్జిబిటర్స్ చేతులెత్తేస్తున్నారు. పద్మావత్‌ను ప్రదర్శించే థియేటర్లను తగలబెడుతామని ఇటీవల కర్ణిసేన సంఘం బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో గుజరాత్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్ల సంఘం పద్మావత్ చిత్ర ప్రదర్శనకు నిరాకరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆ సినిమాను రిలీజ్ చేయకూడదని నిర్ణయించినట్లు గుజరాత్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ డైరక్టర్ రాకేశ్ పటేల్ తెలిపారు. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో మల్టీప్లెక్స్ ఓనర్లు భయపడుతున్నారని, నష్టాన్ని భరించాలని థియేటర్లకు లేదని, మేం ఎందుకు ఆ నష్టాన్ని ఎదుర్కోవాలని సంఘం ప్రశ్నిస్తున్నది. ఈ నేపథ్యంలో సినిమాను మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించ రాదు అని నిర్ణయించినట్లు ఆ సంఘం డైరక్టర్ తెలిపారు.2326

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018