సినీ నిర్మాత కేసీ శేఖర్‌బాబు కన్నుమూత

Sat,February 25, 2017 08:29 AM
film producer KC Sekhar babu passed away

హైదరాబాద్: సినీ నిర్మాత కేసీ శేఖర్‌బాబు కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారు జామున మృతి చెందారు. 1946 మే 1న ఆయన జన్మించారు. మమత, సంసారబంధం, గోపాల్‌రావుగారి అమ్మాయి, ముఠామేస్త్రీ, సర్ధార్, సహాస సామ్రాట్, భార్గవ రాముడు చిత్రాలను నిర్మించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా గా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందిస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హాఠాన్మ‌ర‌ణం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని క‌ల‌చి వేసింది. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. చిరంజీవి శేఖర్ బాబు కుటుంబానకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

1604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles