‘ఫ్యాషన్ డిజైనర్’ సెకండ్ సాంగ్ విడుదల

Fri,April 21, 2017 05:24 PM
Fashion Designer s/o Ladies Tailor Song

లేడీస్ టైలర్ చిత్రంకి సీక్వెల్ గా వంశీ తెరకెక్కిస్తున్న‘ఫ్యాషన్ డిజైనర్’(సన్నాఫ్ లేడీస్ టైలర్) అనే మూవీ సెకండ్ సాంగ్ రీసెంట్ గా స్రవంతి రవి కిషోర్ చేతుల మీదుగా రిలీజ్ అయింది . సుమంత్ అశ్విన్ హీరోగా లేడీస్ టైలర్ సీక్వెల్ రూపొందుతుండగా, వంశీ చిత్రంలోని పాటలను డైరెక్ట్ గా నెట్ లోకి విడుదల చేస్తూ మూవీపై హైప్స్ తెస్తున్నాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ ముఖ్య పాత్ర చేశాడని తెలుస్తుంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్,మనాలి రాథోడ్ , ఈషా, మానస కథానాయికలుగా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం ఈ మూవీని తారా స్ఠాయికి తీసుకెళ్ళడం ఖాయం అంటున్నారు. మరి తాజాగా విడుదలైన సెకండ్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS