ధ‌నుష్ మూవీ ఇన్నాళ్ళ‌కి విడుద‌ల కాబోతుంది!

Sat,February 16, 2019 01:37 PM

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా రాణిస్తూ కోలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ధనుష్‌. ఇటీవ‌ల మారి 2 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. అయితే గతంలో స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్‌తో క‌లిసి ఎన్నై నోకి పాయుమ్ తొట్ట అనే చిత్రం చేశాడు ధ‌నుష్‌. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికి ప‌లు కార‌ణాల వ‌ల‌న చిత్రాన్ని విడుద‌ల చేయ‌లేక‌పోయారు. అయితే ఈ మూవీ రిలీజ్‌కి లైన్ క్లియర్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ సాధించింది. త్వ‌ర‌లోనే మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు అంటున్నారు. ధనుష్ సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటించ‌గా, శశికుమార్‌ కీలక పాత్రలో నటించారు. ధ‌నుష్ కెరీర్‌లో ఈ చిత్రం మ‌రో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంద‌ని మేకర్స్ అంటున్నారు.
3010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles