అమ్మాయిలతో మాత్రమే స్నేహం చేయాలనుకోవడం లేదు..

Sun,June 16, 2019 03:59 PM
Disha patani reacts trolls on her boyfriends


‘లోఫర్‌’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్ల రావడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. ఈ భామ ఎమ్‌ఎస్‌ ధోనీ, బాఘీ 2 చిత్రాలతోపాటు ఇటీవలే సల్మాన్ ఖాన్ ‘భారత్‌’ లో తళుక్కున మెరిసింది. దిశా మొదట ఆదిత్యా ఠాక్రే, ఆ తర్వాత తన కోస్టార్ టైగర్ ష్రాప్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో భాయ్ ప్రెండ్స్ కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

దీనిపై దిశా పటానీ మాట్లాడుతూ..స్నేహితుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉంటారు. స్నేహితులతో కలిసి ప్రతీ ఒక్కరూ డిన్నర్ కు వెళ్తుంటారు. అందులో ఏం తప్పుంది? జెండర్ ను ఆధారంగా స్నేహం చేయడం నాకు అలవాటు లేదు. తాను కేవలం అమ్మాయిలతోనే స్నేహం చేయాలనుకోవడం లేదంటూ ట్రోల్స్ కు స్పందించింది.

4038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles