జ‌వాన్ల‌ కుటుంబాల‌కు ‘ఉడ్తా పంజాబ్’ న‌టుడు ఆర్థిక‌సాయం

Mon,February 18, 2019 05:33 PM

జ‌మ్మూక‌శ్మీర్ : పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జ‌వాన్ల కుటుంబాల‌కు ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు రూ.2.5 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించారు.

తాజాగా ‘ఉడ్తా పంజాబ్’ న‌టుడు దిల్జీత్ దోసాంజ్ సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు త‌న వంతుగా సాయమందించాడు. సీఆర్పీఎఫ్ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ కు దిల్జీత్ రూ.3 ల‌క్ష‌లు విరాళంగా అందించాడు. దిల్జీత్ న‌గదు విరాళానికి సంబంధించిన స్నాప్ చాట్ ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశాడు. సైనికులు మ‌న దేశానికి, దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్ష‌ణ‌గా ఉంటారు. దేశానికి ర‌క్ష‌ణగా ఉండే సైనికులు.. వారిని ఎంతో ప్రేమించే వారికి దూరమ‌య్యారు. జ‌వాన్ల‌ను కోల్పోయిన కుటుంబాల‌కు..వారు (జ‌వాన్లు) ఎపుడు తిరిగొస్తారో తెలియ‌దు. ఇన్నాళ్లుగా వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ‌స‌భ్యుల‌ ఆశ చెదిరిపోయింది. అమ‌ర‌జజ‌వాన్ల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు మీ వంతుగా సహాయ‌మందించాల‌ని త‌న అభిమానుల‌ను కోరాడు దిల్జీత్.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles