మాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రజినీ అల్లుడు

Sun,March 19, 2017 10:53 AM
మాలీవుడ్ ఆరంగేట్రం చేసిన రజినీ అల్లుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడిగా కాకుండా కేవలం తన టాలెంట్ తో టాప్ పొజీషన్ కి వెళ్లాడు ధనుష్. సింగర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఇలా పలు రంగాలలో సత్తా చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం వీఐపీ2 అనే చిత్రంలో నటిస్తూ పవర్ పాండి అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక రజినీకాంత్ ప్రధాన పాత్రలో పా.రంజిత్ తెరకెక్కించనున్న చిత్రాన్ని ధనుష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లో లాంచ్ కానుంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళంలో తన హవాని నడిపించిన ధనుష్ ప్రస్తుతం మాలీవుడ్ కి కూడా వెళ్ళాడు. అది నిర్మాతగా. మృత్యుజయ్ ఫేమ్ డోమినిక్ అరుణ్ అప్ కమింగ్ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లగా ఈ చిత్రాన్ని ధనుష్ తన వార్డ్ రోబ్ బేనర్ పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ రైజింగ్ స్టార్ తొవినో థామస్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన నేహ అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. ముంబైకి చెందిన నేహ ఈ చిత్రంతో ఆరంగేట్రం చేస్తుంది.

1507

More News

VIRAL NEWS