విడుదలైన సినిమాకి ట్రీట్ మెంట్ చేసి మళ్ళీ విడుదల

Sat,November 18, 2017 11:26 AM
C/O SURYA MOVIE re released soon

సినిమా తీయడం ఒక యాగమైతే, దాన్ని విడుదల చేయడం, ప్రమోట్ చేసుకోవడం మరో భారీ ప్రయత్నం. సినిమా విడుదలయ్యాక, అది సక్సెస్ అయినా, ఫ్లాప్ అయినా ప్రమోషన్ యాక్టివిటీ తప్పడంలేదు. తీసిన మూవీ సరిగా ఆడకపోతే దాన్ని పట్టాలమీద నడిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తీసేసిన సీన్లు కలుపుతున్నారు. ఇటీవల విడుదలైన కేరాఫ్ సూర్య విషయంలో ఓ ఎక్స్ పెరిమెంట్ చేయబోతున్నారు.

సందీప్ కిషన్ .. మెహ్రీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నెంజిల్ తునివిరుందల్'. ఈ మూవీ తెలుగులో కేరాఫ్ సూర్య పేరుతో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. దీంతో దర్శకుడు హీరోయిన్ కి సారీ చెబుతూ కొన్ని సీన్స్ తీసేసాడు కూడా. సీన్స్ తీసేసిన తర్వాత కథ పట్టాలు తప్పినట్టుగా అనిపించిందట. దాంతో ఈ సినిమాను థియేటర్స్ లో నుంచి తీసేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారని టాక్.

'నెంజిల్ తునివిరుందల్' చిత్రాన్ని రీ షూట్ చేసి .. కొన్ని సీన్స్ ను యాడ్ చేసి, వచ్చేనెల 15వ తేదీన మళ్లీ ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇలా చేయడం వలన టైం వేస్ట్ తో పాటు బడ్జెట్ కూడా వేస్ట్ అనేది కొందరి మాట. మరి ఇదేదో ముందుగానే చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు మార్పులు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అనేది కోలీవుడ్ లో వినిపిస్తోన్న మాట.

1048
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS