కాబోయే భార్య కోసం చైతూ స్పెషల్ వంటకం

Fri,April 21, 2017 03:52 PM
chaitu prepare special dish for sam

అక్కినేని నాగ చైతన్య త్వరలో సౌత్ గ్లామర్ బ్యూటీ సమంతని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం అక్టోబర్ లో జరగనున్నట్టు ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరిరివురికి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చిన అది ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. తాజాగా సమంత, చైతూ కలిసి ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాములుగానే మంచి చెఫ్ అయిన చైతూ కాబోయే భార్య కోసం ఖాళీ సమయాలలో మంచి వెరైటీలు చేసి పెడుతుంటాడు. ఇక రీసెంట్ గా జరిగిన ఓ పార్టీలో చైతూ ప్రిపేర్ చేస్తున్న వంటకాలని చూసి అక్కడి వారు విస్తుపోయారట. ఇక టేస్ట్ చేసిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేవంటున్నారు. సమంత మాత్రం తన కాబోయే భర్త చేసిన వంటకాలని మాత్రం తనివితీరా ఆస్వాదించిందట.


2043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS