సీబీఎఫ్‌సీ నుండి వెన‌క్కి వ‌చ్చేసిన ప‌ద్మావ‌తి

Sat,November 18, 2017 02:17 PM
censor sends back ro padmavathi

దీపికా ప‌దుకొణే, షాహిద్ క‌పూర్‌, ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ప‌ద్మావ‌తి. సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ఈ చిత్రం వివాదాల న‌డుమ షూటింగ్ పూర్తి చేసుకోగా, డిసెంబ‌ర్ 1న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. అయితే రాజ్‌పుత్ కర్ణిసేన కార్య‌క‌ర్త‌లు ఈ సినిమాని ఎట్టి ప‌రిస్థితుల‌లో విడుద‌ల కానివ్వ‌మ‌ని అంటుంటే సినిమా రిలీజ్‌ని ఎవ‌రు అడ్డుకోలేరంటూ చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో చిత్ర యూనిట్ గ‌త వారం ప‌ద్మావ‌తి మూవీని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)కు పంపారు. రివ్యూకి పంపిన ద‌ర‌ఖాస్తుని చిత్ర బృందం పూర్తిగా పూరించ‌క‌పోవడంతో సినిమాకి స‌ర్టిఫికెట్ ఇవ్వ‌కుండా సీబీఎఫ్‌సీ వెన‌క్కి పంపింద‌ట‌. అప్లికేష‌న్ పూర్తిగా ఫిల్ చేసి పంపిన త‌ర్వాత మాత్ర‌మే స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని స‌భ్యులు అంటున్న‌ట్టు తెలుస్తుంది. క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు బెదిరింపుల‌కి పాల్ప‌డుతున్న‌ప్ప‌టికి చిత్ర యూనిట్ మాత్రం జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. దీపిక ముక్కు కోస్తామ‌ని, ఆమె త‌ల తెస్తే 5 కోట్లు ఇస్తామ‌ని వార్నింగ్‌లు ఇచ్చిన‌ప్ప‌టికి దీపిక మాత్రం ప‌లు కార్య‌క్ర‌మాల‌లో త‌న సినిమాకి సంబంధించిన సాంగ్స్‌కి స్టెప్స్ వేస్తూ ఆహుతుల‌ని అల‌రిస్తుంది. సినిమా సెన్సార్ క‌నుక లేట్ అయితే మూవీ జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. అయితే ప‌ద్మావ‌తి విడుద‌ల రోజున రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వీ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS