మెర్సల్ టీజర్‌కి సెలబ్రిటీల ప్రశంసలు

Fri,September 22, 2017 12:12 PM
CELEBRITIES TWEETS ON MERSAL TEASER

ఇలయ దళపతి విజయ్ .. థేరి సినిమా తర్వాత అట్లీతో చేస్తున్న చిత్రం మెర్సల్. విజయ్ 61వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ మూడు భిన్న పాత్రలలో కనిపించనున్నాడు. సమంత, నిత్యామీనన్, కాజల్ కథనాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో అదిరింది అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది. కమర్షియల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. అయితే తాజాగా మెర్సల్ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇది కేవలం ఆడియన్స్‌లోనే సెలబ్రిటీస్‌లోను వైబ్రేషన్ కలుగజేసింది. టాలీవుడ్ , కోలీవుడ్ సెలబ్రిటీలు మెర్సల్ టీంపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ టీజర్ యూ ట్యూబ్‌లో ఎక్కువ లైకులు పొందిన టీజర్‌గా రికార్డు నెలకొల్పేందుకు ఉరకలు పెడుతుంది. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబరు 18న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో నిర్మాత శరత్‌ మరార్‌ విడుదల చేయబోతున్నారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్ జే.సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, కోవైసరళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles