ముంగిస‌కి డ‌బ్బింగ్ చెప్పిన అలీ..పుంబ‌కి బ్ర‌హ్మి

Thu,June 20, 2019 08:39 AM
Bramhanandham and Ali to  lend voice to  Pumba and Timba charecters

కార్టూన్ నెట్ వ‌ర్క్‌లో కామిక్ సీరియ‌ల్‌గా మొద‌లైన ల‌య‌న్ కింగ్‌ని డిస్నీ సంస్థ 1990లో 2డీ యానిమేటెడ్ మూవీగా విడుద‌ల చేశారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మ‌రింత సాంకేతిక‌త‌ని జోడించి 3డీ యానిమేటెడ్ మూవీగా ల‌య‌న్ కింగ్‌ని విడుద‌ల చేయ‌బోతున్నారు. జూలై 19న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని అందించ‌నుందని చెబుతున్నారు. ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌గా, ఇందులో సింబ అనే సింహం, టీమోన్ అనే ముంగిస‌, పుంబా అనే అడ‌వి పంది చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లుగా ఉంటాయి. ముసాఫా అనేది కూడా చిత్ర ప్ర‌ధాన పాత్ర కాగా, బాలీవుడ్‌లో ఈ పాత్ర‌కి షారూఖ్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పారు. ముసాఫా త‌న‌యుడు సినిమాకి హీరో అయిన సింబాకి షారూఖ్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పారు. తెలుగులోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో తెలుగు వెర్షన్‌లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్‌ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ల‌య‌న్ కింగ్ భారీ ఎత్తున విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు.


1580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles