బిగ్ బాస్‌లో ర‌చ్చ ఇప్పుడే మొద‌లైంది..!

Tue,June 19, 2018 08:40 AM
big boss 9th episode very intresting

శ‌ని, ఆది వారాల‌లో నానితో క‌లిసి సంద‌డి చేసిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్ సోమవారం ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీ అయ్యారు. సోమవారం నాటి 9వ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు . ఇప్ప‌టికే హౌజ్ నుండి సంజ‌న బ‌య‌ట‌కి వెళ్ళ‌డంతో 15 మంది కంటెస్టెంట్‌లు ఉన్నారు. కాని రీసెంట్‌గా బిగ్ బాస్‌ హౌజ్‌లోకి నటి నందిని రాయ్‌ని నాని ఆహ్వానించడంతో మ‌ళ్ళీ ఆ సంఖ్య 16కి చేరింది. ఇప్పుడు మ‌రో వ్య‌క్తిని బిగ్ బాస్ సీజ‌న్ 2 నుండి పంపేయ‌డానికి రంగం సిద్ధ‌మైంది.

హౌజ్ మేట్స్ అంద‌రు ఎలిమినేష‌న్ కోసం పేర్ల‌ని సూచించాల‌ని 9వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సూచించ‌డంతో కంటెస్టెంట్స్ అంద‌రు త‌మ అభిప్రాయాన్ని కన్ఫెష‌న్ రూమ్‌లో చెప్పారు. హౌజ్‌కి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సామ్రాట్ ఎలిమినేష‌న్‌లో లేడ‌ని బిగ్ బాస్ తేల్చి చెప్ప‌డంతో పాటు అత‌ని పేరుని ఎవ‌రు క‌న్ఫెష‌న్ రూమ్‌లో నామినేట్ చేయోద్ద‌ని కోరాడు. అంతేకాదు ఎలిమినేష‌న్ కోసం సామ్రాట్ ఒక పేరు చెప్పాల‌ని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశారు. దీంతో సామ్రాట్ యూ ట్యూబ్ ఫేం దీప్తి సున‌య‌న‌ని నామినేట్ చేశాడు. అయితే బిగ్ బాస్ ఆదేశాల మేర‌కు మిగ‌తా కంటెస్టెంట్స్ ఇద్ద‌రిద్దరిగా కన్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్ళి ఎలిమినేష‌న్ కోసం పేర్ల‌ని నామినేట్ చేశారు.

ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా సామ్రాట్.. దీప్తి సునైనాని నామినేట్ చేయ‌గా, ఎక్కువ మంది గణేష్, నూతన్ నాయుడు, కౌశల్, బాబు గోగినేని పేర్లను ఎక్కువ‌ మంది నామినేట్ చేశారు. క‌న్పెష‌న్‌లో రూంలోకి ఇద్ద‌రిద్ద‌రిగా వెళ్ళిన‌ సెల‌బ్రిటీలు చేసిన కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు రానున్న రోజుల‌లో బిగ్ బాస్ షో మంచి మజాని అందించ‌నుంద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తుంది. ముఖ్యంగా కౌశ‌ల్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న అమ్మాయిల‌పై చేతులు వేయ‌కుండా మాట్లాడ‌డు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది భానుశ్రీ.

చేయి వేసిన‌ప్పుడు మొహంపైన చేయి తీయి అని చెప్ప‌డం బాగుండ‌దు కాబ‌ట్టి ఏమి అన‌లేదు. ఈ కార‌ణంగానే కౌశ‌ల్‌ని ఎలిమినేష‌న్‌కి నామినేట్ చేశానంటూ భానుశ్రీ పేర్కొంది. ఇక పిల్లి వేషం వేసిన‌ప్పుడు త‌ను న‌న్ను ఎత్తుకెళ్ల‌డం అస్స‌లు న‌చ్చ‌లేదంటూ దీప్తి సున‌య‌న చెప్పింది. సొంత అన్న‌య్య‌కు కూడా నేను అంత చొర‌వ ఇవ్వ‌న‌ని ఆమె తేల్చి చెప్పింది. ఇక సోమ‌వారం ఎపిసోడ్‌లో స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన న‌టి నందిని అంద‌రితో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపింది. హౌజ్‌లో ఉన్న వారి గురించి ట్విట్ట‌ర్ రియాక్ష‌న్ ఎలా ఉందో విపులీక‌రించింది.

ఫాద‌ర్స్ డే రోజు దీప్తి సున‌యన కంట‌త‌డిపెట్ట‌డంతో అంద‌రు భావోద్వేగానికి గుర‌య్యారు అని అంది. ఈ టైంలో నా గురించి ఏమ‌నుకుంటున్నారు అని కౌశల్ అడ‌గ‌గానే.. అమ్మాయిలు అత‌నికి దూరంగా ఉంటే మంచిది అని న‌వ్వుతూ చెప్పుకొచ్చింది నందిని. అయితే ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది భానుశ్రీ త‌నకి త‌ల‌నొప్పిగా ఉందంటే , వెంట‌నే గ‌ణేష్ జండూబామ్ తెచ్చి ఆమెకి పెట్టి, తల మ‌సాజ్ చేశాడు. సోమ‌వారం నాటి కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే రానున్న రోజుల‌లో బిగ్ బాస్ హౌజ్‌లో ర‌చ్చ మాములుగా ఉండద‌నే అభిప్రాయం జ‌నాల‌లో క‌లుగుతుంది.

5600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles