స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చిన బండ్ల గణేష్

Sun,March 19, 2017 08:28 AM

బండ్ల గణేష్.. ఈ పేరు ఒకప్పుడు కమెడీయన్ గా మాత్రమే సుపరిచితం. ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలు అందిస్తున్నాడు ఈ ప్రముఖ నిర్మాత. అయితే గబ్బర్ సింగ్ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న బండ్ల గణేష్ త్వరలో మరిన్ని ప్రాజెక్టులు చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకకి హాజరైన బండ్ల గణేష్ మరోసారి పవన్ భజన చేశాడు. ఈ సారి ఏకంగా స్వాతంత్ర్య సమరయోధులతో పవన్ ని పోల్చుతూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశాడు... ఏమని చెప్పను నా దేవుడి గురించి? కళ కళ కోసం ప్రజల కోసం అన్న మహాకవి బళ్ళారి రాఘవ ఆయన అని చెప్పనా? స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతా అన్న బాలగంగాధర తిలక్ అని చెప్పనా? కులం యొక్క పునాథులపై ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేం అన్న అంబేద్కర్ అని చెప్పనా? భారత దేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళు అన్నాడు అహ్మద్ ఖాన్.. అలాంటాయనని చెప్పనా? అవసరమైతే చిరిగిన చొక్క తొడుక్కో కాని మంచి పుస్తం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం పంతులు అని చెప్పనా? ఆర్య సమాజం నా తల్లి.. వైధికులం నా తండ్రి.. అన్న లాలాలజపతి రాయ్ అని చెప్పనా? వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్.. ఆయనని చెప్పనా? బెంగాళ్ విభజనే బ్రిటీష్ పతనంకు నాంది అన్నాడు మహాత్మ గాంధి.. ఆయనని చెప్పనా? నాకు రక్తం ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యం తెచ్చిస్తా అన్నాడు శుభాష్ చంద్రబోస్.. ఆయనని చెప్పనా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పనా?.. మనకు చెప్పడాలు లేవు.. ఆయన చెప్పింది చెయ్యడమే అంటూ బండ్ల గణేష్ అభిమానులలో వైబ్రేషన్స్ పుట్టించాడు. ఇక చివరగా మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ పవన్ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మరి గణేష్ పూర్తి స్పీచ్ కోసం ఈ వీడియో చూడండి

1893

More News

మరిన్ని వార్తలు...