కేఎల్ రాహుల్‌తో ఎఫైర్..ఘాటుగా స్పందించిన సోనాల్‌

Fri,September 20, 2019 01:03 PM

లెజెండ్‌, డిక్టెట‌ర్ చిత్రాల‌లో బాల‌కృష్ణ‌కి జోడీగా న‌టించిన సోనాల్ చౌహ‌న్ ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్- బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. కొన్నాళ్లుగా ఈ అమ్మ‌డు కేఎల్ రాహుల్‌తో ఎఫైర్‌కి సంబంధించి ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. రాహుల్‌తో ఎఫైర్‌కి సంబంధించి ప‌లు మీడియా సంస్థ‌ల ద్వారా ఈ అమ్మ‌డు క్లారిటీ ఇచ్చిన పుకార్ల‌కి బ్రేక్ ప‌డ‌డం లేదు. తాజాగా ఓ నెటిజ‌న్ రూమ‌ర్స్ లేకుండా మీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోతున్నారా ? రూమ‌ర్స్ లేక‌పోతే సినీ ప‌రిశ్ర‌మ‌లో మీకు మ‌నుగ‌డ కూడా ఉండ‌దు అని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సోనాల్.. రూమ‌ర్స్ .. రూమ‌ర్స్‌.. రూమ‌ర్స్ .. ఎవ‌రు వీటిని పుట్టిస్తున్నారు అని ఘాటుగా బ‌దులిచ్చింది. ఆ త‌ర్వాతి ట్వీట్‌లో మీరు ప్ర‌తి విష‌యంలో చాలా ఎక్స్‌ప‌ర్ట్‌లా క‌నిపిస్తున్నారు. విచారకరమైన జీవితంతో చాలా నిరాశ చెందారు. ప్రతి ఒక్కరి గురించి నెగెటివ్ కోణంలో ఆలోచించే మీ ప్రతికూల మనస్తత్వాన్ని మార్చడంపై మీరు దృష్టి పెట్టాలి. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని సోనాల్ పేర్కొంది.






2478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles